గుంటూరు జిల్లా తాడికొండలో పున్నమ్మ చెరువు ఆక్రమణదారులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కబ్జాదారులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు మురళి కృష్ణ, ఎర్రెంశెట్టి రవి..రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాత్రివేళల్లో ప్రొక్లెయిన్ సాయంతో చెరువును పూడ్చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని జేసీ ప్రశాంతి దృష్టికి తీసుకెళ్లామని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.