Acharya Nagarjuna University: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరోసారి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడింది. గతంలో మూడు రాజధానులకు మద్దతుగా సదస్సు నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్న విశ్వవిద్యాలయం తాజాగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న జీవో నెంబర్ ఒకటికి మద్దతుగా అవగాహన సదస్సు నిర్వహించింది. ఇలాంటి జీవో బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడుతోందని విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య వరప్రసాద్ మూర్తి చెప్పారు. ఈ తరహా జీవో ఎప్పుడో రావాలని ఇప్పటికే ఆలస్యమైందన్నారు. రద్దీ ప్రాంతాలలో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకుండా ఉండాలని ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చారని దీనిని అందరూ స్వాగతించాలని చెప్పారు.
జీవో 1ని స్వాగతించి చర్చనీయాంశంగా మారిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ - ఏఏన్ యూ
Acharya Nagarjuna University: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరోసారి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడింది. రద్దీ ప్రాంతాలలో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకుండా ఉండాలని ఉద్దేశంతోనే జీవో నెంబర్ ఒకటిని తీసుకొచ్చారని, దీనిని అందరూ స్వాగతించాలని చెప్పారు.
acharya nagarjuna university support to GO NO 1 in guntur