గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఏడాది కాలంలో 24 ర్యాంకులు సాధించినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో 15, జాతీయస్థాయిలో 7, రెండు ధృవపత్రాలను ఏఎన్యూ సొంతం చేసుకుంది. ఈ అరుదైన గుర్తింపు సాధించిన విశ్వవిద్యాలయంగా ఏఎన్యూ నిలిచిందని ఎఫ్ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్ చెప్పారు. బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ఘనత దక్కిందని అన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన రికార్డు - Asian Book of Records news
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏడాది కాలంలో 24 ర్యాంకులు సాధించినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కైవసం చేసుకుంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన రికార్డు..