ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కోసం తల్లిని చంపిన కొడుకు అరెస్ట్ - తెనాలిలో తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

మద్యం కోసం తల్లిని చంపేశాడు.. అప్పట్నుంచి పరారీలో ఉన్నాడు.. అయితే ఎంతోకాలం తప్పించుకోలేకపోయాడు.. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈనెల 6న గుంటూరు జిల్లా తెనాలిలో తల్లిని హత్యచేసిన కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

accused arrested in mother murder case in tenali guntur district
మద్యం కోసం తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

By

Published : Jun 8, 2020, 4:23 PM IST

మద్యం కోసం డబ్బులివ్వలేదని తల్లిని హత్యచేసిన కేసులో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఈనెల 6న పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన ముమ్మలనేని లక్ష్మీనారాయణ తన తల్లి శశిదేవిని మద్యం కోసం డబ్బులడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేయగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అప్పటినుంచి లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడు. ఈరోజు నిందితుడు మార్కెట్ సెంటర్​లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ బత్తుల శ్రీనివాసరావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details