గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పేరుకలపూడి గ్రామంలో ఆరాధ్యుల రాము, దానబోయిన నరసింహా అనే రైతుల మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని రెండు ఎకరాల్లోని పంట కాలిపోయింది. దాదాపు లక్ష రూపాయలు పంట నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
అన్నదాత కష్టం అగ్గిపాలు.. రూ.2.50లక్షల పంట నష్టం - Corn crop loss news
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్గి పాలైంది. ప్రమాదవశాత్తు తెనాలి మండల పరిధిలో ఐదెకరాలలో గల మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకుని కాలిపోయింది. దాదాపు 2లక్షల 50వేల రూపాయల పంట నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
accidentally fire in Corn crop
అదే క్రమంలో కఠెవరం గ్రామంలో బిక్కీ రామారావు అనే రైతు మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. 1.50 వేల ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా మెడికల్ కిట్లు