గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ బంధువు మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వీరంతా.. స్వగ్రామం ఏటుకూరుకు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆటో డ్రైవర్ అంకారావు (38), అతని తండ్రి చిన్న అబ్బాయి (64) గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరు మృతి - latest news of guntur accidents
బంధువు మరణించగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణమైన వారు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టగా.. ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
![లారీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరు మృతి a auto dashed lorry in guntur dst 2died 6 injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6785513-274-6785513-1586846507652.jpg)
లారీని డీకొట్టిన ఆటో..ఇద్దరు మృతి