గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాదెండ్ల మండలం సాతులూరు వద్ద కర్నూల్ - గుంటూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నఅదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సుబ్బారావు(60)ను వేగంగా వెళుతున్న ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
చిలకలూరిపేటలో రెండు వేర్వేరు ప్రమాదాలు..ఆర్ఎంపీ మృతి - గుంటూరు జిల్లాలో ప్రమాదం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో శనివారం జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఆర్ఎంపీ ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
accident
16వ నెంబర్ జాతీయ రహదారిపై.. మండల కేంద్రమైన యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ ఎదురుగా.. వెళ్తున్న కారును వెనకనే వస్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న రెండు గొర్రెలు మృతి చెందాయి. రెండు ప్రమాదాలకు సంబంధించి నాదెండ్ల యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'దిల్ బెచారా' చూసి భావోద్వేగం చెందిన సుశాంత్ ఫ్యామిలీ