గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వినుకొండకు చెందిన జె. వెంకట పురుషోత్తమ కుమార్(43) వ్యాపారం నిమిత్తం విశాఖ వెళ్లి తిరిగి వస్తున్నారు. అతని కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పురుషోత్తమ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ లక్ష్మిరెడ్డి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - road accident at vankayalapadu
08:17 August 19
మరొకరికి తీవ్రగాయాలు
మరో గంటలో గమ్యం చేరేవారే.. అంతలోనే..
విశాఖ నుంచి వస్తున్న పురుషోత్తమ కుమార్ ముందుగా నరసరావుపేట నుంచి నుంచి వినుకొండకు వెళదామనుకున్నారు. దగ్గర అవుతుందని చిలకలూరిపేట మీదుగా వెళుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఆపకుండానే వెళ్లిపోయాడు. మరో గంట అయితే వారు ఇంటికి చేరేవారే. మృతుడు వ్యాపారం చేయడంతో పాటు ఓ పత్రికలో విలేకరిగా పనిచేశారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: