రాజధాని పేరుతో అమరావతిని తెదేపా అధినేత చంద్రబాబు.. తన అవినీతికి కేంద్రంగా మార్చారని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన అనుచరులు అమరావతి ప్రాంతంలో చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ప్రజల ముందు పెడతామని చెప్పారు. ఈ భారీ భూదందాపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కోరారు. ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోందని... త్వరలో నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
'ఇన్సైడర్ ట్రేడింగ్‌ను సుమోటోగా స్వీకరించాలి' - అమరావతిలో అవినీతి
'అమరావతిలో జరిగిన భారీ భూ దందాపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి' అని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోందని చెప్పారు.
'Accept insider Trading in amaravati as Sumoto' ycp mla request to courts