ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిఫార్సు లేఖలపై అచ్చెన్నకు అనిశా ప్రశ్నలు - అచ్చెన్నాయుడిని ఏసీబీ విచారణ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై అనిశా విచారణ ముగింపు దశకు చేరుకుంది. రెండో రోజున 5 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. మరోవైపు అచ్చెన్నాయుడుకు కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు శనివారంతో ముగియనుంది. దీనివల్ల మరోసారి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో అచ్చెన్నను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

achenna
సిఫార్సు లేఖలపై అచ్చెన్నకు అనిశా ప్రశ్నలు

By

Published : Jun 26, 2020, 5:27 PM IST

Updated : Jun 27, 2020, 2:41 AM IST

ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అవినీతి నిరోధకశాఖ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్​లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ మధ్యాహ్నం 2.30 గంటల వరకూ జరిగింది. ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం మళ్లీ 5 గంటలకు రెండో విడత విచారణ ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు ముగించారు. మొత్తం దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. మొదటి రోజున విచారణ రాత్రి 8.30 గంటల వరకూ కొనసాగించటంపై న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం విచారణ త్వరగా ముగించారు.

అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలపైనే శుక్రవారం విచారణ జరిగినట్లు సమాచారం. 'మొత్తం 3 లేఖలు మీ నుంచి ఈఎస్ఐ అధికారులకు వచ్చాయి. అలా ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చింది? తద్వారా మీకు ఎలాంటి లాభం వచ్చింది? అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు?' వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

లేఖల ఆధారంగా అచ్చెన్నాయుడుని ఈ కేసులో దోషిగా నిరూపించేందుకు అనిశా అధికారులు యత్నించారని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు అన్నారు. అయితే ఔషధాల కొనుగోలు వ్యవహారం అంతా ఈఎస్ఐ డైరక్టర్ల చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు. లేఖ అనేది కేవలం సలహా మాత్రమేనని... నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులేనని ఆయన అన్నారు.

మరోవైపు అచ్చెన్నాయుడుకి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ శనివారంతో ముగియనుంది. దీనివల్ల అచ్చెన్నాయుడిని మరోసారి అనిశా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి కూడా ఇంకా మెరుగుపడలేదని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎండోస్కోపి నిర్వహించారు. రక్తపు విరేచనాలు అవుతున్నట్లు ఆయన వైద్యులకు తెలపటంతో.. సంబంధిత పరీక్షలు కూడా చేశారు. వాటికి సంబంధించిన నివేదికల ఆధారంగా చికిత్స అందించనున్నారు.

మీడియాతో న్యాయవాది హరిబాబు

ఇదీ చదవండి

చెల్లింపులే జరగనప్పుడు అవినీతి ఎక్కడిది: నారా లోకేశ్

Last Updated : Jun 27, 2020, 2:41 AM IST

ABOUT THE AUTHOR

...view details