గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ పరిపాలనా భవనంలో శనివారం అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ గదిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని కొన్ని ముఖ్యమైన దస్త్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు..
సంగం డెయిరీ పరిపాలనా భవనంలో అనిశా అధికారుల తనిఖీలు - Sangam Dairy Latest News
సంగం డెయిరీలో రెండోరోజు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది సోదాలు ముగిశాయి. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ఛాంబర్‌ను సీల్ చేసిన అధికారులు.. విస్తృతంగా సోదాలు చేశారు.
సంగం డెయిరీలో రెండోరోజు అ.ని.శా. సోదాలు