ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిశా వలలో బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి - repalle acb rides news in telugu

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రేపల్లె నియోజకవర్గ బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి సయ్యద్ షాజహాన్ లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

acb rides on bc welfare officer in guntur district

By

Published : Nov 6, 2019, 7:59 AM IST

అనిశాకు చిక్కిన బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి సయ్యద్ షాజహాన్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం అడవులదీవి పల్లెపాలెంలోని బాలుర బీసీ హాస్టల్​కు సంబంధించి.. గత 3 నెలల బిల్లులను మంజూరు చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారి సయ్యద్ షాజహాన్​ ను కోరారు. ఆ బిల్లులు పాస్ చెయ్యాలంటే జూన్, జులై నెలల బిల్లులకు సంబంధించి 90 వేల రూపాయలు లంచం అడిగారు. లంచం ఇవ్వటానికి ఇష్టంలేని బాధితుడు ఈ నెల 2వ తేదీన అనిశాను ఆశ్రయించారు. ఏటీఎం వద్ద నుంచి 60 వేల రూపాయలు డబ్బులు తీసి ఇస్తుండగా అధికారులు షాజహాన్ ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిసీలించినట్లు అనిశా ఏఎస్పీ సురేష్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details