సంగం డెయిరీలో శుక్రవారం తనిఖీలు చేసేందుకు జాప్యం జరగడంతో శనివారానికి వాయిదా వేశారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి పై అంతస్తులోని కార్యాలయంలో ఏసీబీ అధికారులు పలు దస్త్రాలను తనిఖీ చేస్తున్నారు. నిన్న వడ్లమూడిలోని సంగం డెయిరీ పరిపాలన భవనంలో ఏసీబీ సోదాలు చేసేందుకు వచ్చారు. అయితే తాళాలు ఛైర్మన్ వద్దనే ఉన్నాయని చెప్పడంతో సాయంత్రం వరకు వేచి ఉన్నారు.
సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు - సంగం డెయిరీలో ఏసీబీ తనిఖీలు న్యూస్
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
ఒక దశలో తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన అధికారులు.. ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సాయంత్రానికి తాళాలు తీసుకున్నప్పటికీ సమయం మించిపోయిందని.. శనివారం కార్యాలయాన్ని తెరిచి తమకు అవసరమైన దస్త్రాలను పరిశీలిస్తామని కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచే తనిఖీలు మెుదలుపెట్టారు.
ఇదీ చదవండి:కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు