అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఓ కాల్ ఆధారంగా ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లా దాచేపల్లి గామాలపాడు వద్ద ఆర్టీఏ చెక్‌పోస్టుపై దాడులు చేశారు. చెక్‌పోస్టు వద్ద నగదు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను విచారించారు. వీరు చెక్‌పోస్టు వద్ద వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డుల్లో లేని 23 వేల 180 రూపాయల నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరిద్దరిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు వివరించారు.
దాచేపల్లిలో ఫోన్ కాల్ ఆధారంగా చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి - gamalapadu rta checkpost acb rides
గుంటూరు జిల్లా గామాలపాడు వద్ద ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డుల్లో లేని నగదును సీజ్ చేశారు. అయితే టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఓ కాల్ ఆధారంగా అనిశా అధికారులు దాడులు చేయడం గమనార్హం.
దాచేపల్లి ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు