రూ.5 వేలు లంచం తీసుకుంటూ గుంటూరు జిల్లా నడిగడ్డ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు. నడిగడ్డకు చెందిన పల్లె పెద్ద సుబ్బారావు తన ఎకరా 27 సెంట్లు వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేయించటానికి వీఆర్వో చిట్టిబాబును సంప్రదించాడు. భూమిని ఆన్లైన్ చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలనిచిట్టిబాబు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇవ్వలేననీ.. రూ.5 వేలు ఇచ్చేందుకు సుబ్బారావు ఒప్పకున్నాడు. డబ్బును తన ఇంటికి తీసుకురావాలని వీఆర్వో రైతుకు చెప్పాడు. ఈ క్రమంలోనే రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి చిట్టిబాబును పట్టుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం చిట్టిబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నడిగడ్డ వీఆర్వో - nadigadda vro in acb custody
భూమిని ఆన్లైన్ చేయటానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ నడిగడ్డ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఏసీబీ వలలో నడిగడ్డ వీఆర్వో