గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెేనికి చెందిన వడ్లమూడి శివరామయ్య అనే కాంట్రాక్టర్ రెండేళ్ల క్రితం నరసరావుపేట పట్టణ పరిధిలో మున్సిపాలిటీ కింద రెండు సీసీ రోడ్లు నిర్మాణం పనులు చేశాడు. అయితే శివరామయ్య మున్సిపల్ కార్యాలయం నుంచి రావాల్సిన నిధుల కోసం సీనియర్ అసిస్టెంట్ మధును సంప్రదించాడు. బిల్లు సొమ్ము విడుదల చేసేందుకు ఆ అధికారి రూ. 8 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. ఆ అధికారి కాంట్రాక్టర్ నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటుంటే పట్టుకున్నట్లు గుంటూరు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో..