గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆటో డ్రైవర్ సుబ్బారావు తన వాహనంలో ప్రయాణించే వారి సౌకర్యం కోసం మంచి ప్రయత్నం చేశారు. తన ఇంట్లో పనికిరాని వస్తువులతో ఏసీ లాంటి పరికరాలన్ని రూపొందించారు. కారు రేడియేటర్ ఫ్యాన్, కూలర్ సైడ్ వాల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సాయంతో ఈ శీతల పరికరం రూపొందించారు. సీసాలో నుంచి నీరు బొట్లు బొట్లుగా కూలర్ వాల్ పై పడుతుంది. అదే సమయంలో రేడియేటర్ ఫ్యాన్ తిరిగేలా బ్యాటరీకి అనుసంధానించారు. దీంతో ఫ్యాన్ తిరిగి చల్లని గాలి ప్రయాణికులకు అందుతుంది. ఒకప్పుడు కారు డ్రైవర్ గా పనిచేసిన సుబ్బారావు ఇపుడు ఆటో నడుపుతున్నారు.
ఈ ఆటోలో చల్ల చల్లటి ప్రయాణం.. - ఈ ఆటోలో ఏసీ ఉందోచ్..
అసలే వేసవి కాలం. బయటికి వస్తే ఎండ చంపేస్తోంది. ఇక ఎండలో ప్రయాణం చేయాలంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికుల కోసం మంచి ఆలోచన చేశారు. చల్లదనాన్ని ఇచ్చేందుకు తన ఆటోలో ఏసీ లాంటి పరికరాన్ని సొంతంగా తయారు చేసి అమర్చారు. అది సూపర్ గా పనిచేస్తోంది అంటున్నారు.
ac-auto