అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాత్రివేళల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో అమరావతి రైతులకు మద్దతుగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో సూమారు 500 మంది మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మందడంలో మహిళలపై జరిగిన దాడిని నిరసిస్తూ తుళ్లూరు వీధులలో ర్యాలీ చేశారు. పెదవడ్లపూడిలో మహిళలు, గ్రామస్థులు సుమారు కిలోమీటరు మేర కాగడాల ర్యాలీ నిర్వహించారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.
అమరావతి రైతులకు అండగా మహిళల భారీ ర్యాలీ - తుళ్లూరుంలో కొవ్వొత్తుల ర్యాలీ
నిరసనలతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాత్రివేళల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి ప్రాంత అన్నదాతలకు తుళ్లూరులో మద్దతుగా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.

protest in tulluru