మూడు రాజధానులు నిర్ణయం సరైనదని భావిస్తే.. దానికి ప్రజామోదం ఉందనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి.. అందరం కలిసి ఎన్నికలకు వెళ్దామని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని.. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ విసిరారు. 'ప్రజలు మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తే మేం మాట్లాడడం ఆపేస్తాం.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం. ఏ విషయమూ 48 గంటల్లో చెప్పండి.' అని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు వీడియో సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావిస్తున్నామనే వైకాపా.. 3 రాజధానుల విషయాన్ని అందులో ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. ప్రజలకు చెప్పకుండా చేయడమంటే నమ్మక ద్రోహమేనని ధ్వజమెత్తారు. ఐదేళ్లకు ఓట్లేశారని.. 5 కోట్ల మంది జీవితాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదని దుయ్యబట్టారు.
మాట మార్చారు..
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మరి ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా అని మండిపడ్డారు. 2014 సెప్టెంబర్ 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ అసెంబ్లీలో అమరావతిపై చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భూ కబ్జాల కోసమేనా..?
రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని వైకాపా ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలువురు నేతలు చెప్పిన వైనాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అందరి మాటలను చదివి వినిపించారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు చేయాలనుకుంటున్నారా..? అని ఆగ్రహం వెలిబుచ్చారు. అప్పుడు రాజధానిని స్వాగతిస్తున్నామన్న ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అని నిలదీశారు.
మాకు నిమిషం పని..!
'మా పార్టీ శాసనసభ్యుల రాజీనామా ఒక్క నిమిషం పని. సమస్య పరిష్కారం అవుతుందంటే చేస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామనే తన సవాల్‌ను స్వీకరిస్తారా..? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా..? అని నిలదీశారు. రాజధాని మార్పు అనేది వైకాపా సొంత విషయం కాదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు అంశం ప్రస్తావించి ఉంటే.. ఎక్కడ చెప్పారో వెల్లడించాలన్నారు.
తెలివి తక్కువ నిర్ణయం