ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ.. - వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ పథకం వర్తింపుచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..
వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..

By

Published : Jul 13, 2020, 9:10 PM IST

Updated : Jul 14, 2020, 12:41 AM IST

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే 6 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఈ పథకం వర్తింపజేయాలని ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి 6 జిల్లాల్లో సేవలు విస్తరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 2,200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో 1,059 వైద్య ప్రక్రియలకే ఆరోగ్యశ్రీని వర్తింపజేసేవారని ఈ సందర్భంగా పేర్కొంది.

Last Updated : Jul 14, 2020, 12:41 AM IST

ABOUT THE AUTHOR

...view details