గుంటూరు జిల్లా క్రోసూరులో ఇసుక లారీని ఢీకొట్టగా.. ఓ యువకుడు మృతి చెందాడు. అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన ఆయుధం శ్రీను(18) వ్యక్తిగత పనులు నిమిత్తం... ద్విచక్ర వాహనంపై క్రోసూరు బయలుదేరాడు. అదే రహదారిలో చింతపల్లి రీచ్ వద్దకు ఇసుక కోసం వెళ్తున్న లారీ... యువకుడిని ఢీకొట్టింది. శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
లారీ డ్రైవర్ అతివేగానికి యువకుడి ప్రాణం బలి - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
లారీ డ్రైవర్ అతివేగానికి ఓ యువకుడి ప్రాణం బలైంది. అతి వేగంగా వస్తున్న ఇసుక లారీ... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టగా... అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుంటూరు జిల్లా క్రోసూరులో ఇసుక లారీ ఢీకొట్టి యువకుడు మృతి