ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్​... ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడి - మైనార్టీలపై దాడులు

ప్రేమ పేరుతో ఓ యువకుడు.. బాలికను ఎత్తుకెళ్లాడు. బాలిక బంధువులు ఆగ్రహంతో ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది.

muslim
నిరసన

By

Published : Jul 8, 2021, 7:52 AM IST

ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. బాలిక బంధువులు ఆగ్రహంతో ఆ యువకుడి ఇంటితో సహా సమీప ముస్లింల ఇళ్లపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల కర్లెపాలెంలో జరిగింది.

బాలికను తీసుకెళ్లిన యువకుడిపై కేసు నమోదు చేసి పట్టుకోవాలే తప్ప తమ ఇళ్లపై దాడి చేయడం ఏంటని ముస్లింలు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్​ సీఐ శ్రీనివాస్​రెడ్డి, ఎస్​ఐ అంజయ్య వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. ఉపసభాపతి కోనా రఘుపతి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

ఇదీ చదవండి:CHILD DEATH: శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details