ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హారన్ కొట్టినందుకు ఆయువు తీయబోయాడు! - guntur district crime news

గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం స్పష్టించాడు. హారన్ కొట్టినందుకు ఇద్దరిని కత్తితో పొడిచాడు.

A young man ... attacked two people
A young man ... attacked two people

By

Published : Sep 9, 2020, 5:55 AM IST

మద్యం మత్తులో ఓ యువకుడు... ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో జరిగింది. చెరుకుపల్లికి చెందిన శశి అనే యువకుడు బైక్​పై వెళ్తుండగా... దీనిని దాటేందుకు వెనుక నుంచి ఓ ఆటో డ్రైవర్ హారన్ మోగించాడు. మద్యం మత్తులో ఉన్న శశి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే బండి దిగి ఆటో డ్రైవర్ సునీల్(40), పక్కన ఉన్న చుక్క సుమంత్ (20) అనే వ్యక్తులను కత్తితో పొడిచాడు.

గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని తాళ్లతో కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కర్లపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details