ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్ల మధ్యలో యువకుడి మృతదేహం గుర్తింపు - guntur latest news

గుంటూరు జిల్లా పేరేచర్లలోని ఆంధ్రా షుగర్స్ కంపెనీ పక్కన ఉన్న చెట్లలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నిర్థరించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

a young Man dies under suspicious circumstances
చెట్ల మధ్యలో యువకుడి మృతదేహం గుర్తింపు

By

Published : Dec 14, 2020, 2:59 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆంధ్ర షుగర్స్ కంపెనీ పక్కన ఉన్న చెట్లలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుని శరీరంపై గాయాలు ఉన్నట్లు తెలిపారు.

ఒడిషా రాష్ట్రానికి చెందిన సుఖంత నాయక్​.. ఈనెల 4న పని నిమిత్తం పేరేచర్లలకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దొరికిన వస్తువులను నిపుణుల బృందం స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details