ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

man attack: యువతిని వేధిస్తున్న యువకుడు... ప్రశ్నించినందుకు..! - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా చిన్నకాకానిలో ఓ వ్యక్తి పై.. యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యువతిని వేధిస్తున్న యువకుడు
యువతిని వేధిస్తున్న యువకుడు

By

Published : Nov 28, 2021, 8:22 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకానిలో దారుణం జరిగింది. తన కుమార్తెను అశోక్ అనే యువకుడు తరచూ వేధిస్తున్న విషయం తెలుసుకున్న ఆ తండ్రి... అర్ధరాత్రి సమయంలోనే అతడి ఇంటికి వెళ్లాడు. నా కూతురును ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు. ఇంటికొచ్చి అందరిముందు అడిగాడన్న కోపంతో... అశోక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వారిద్దరినీ ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు... మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details