ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల,మొండెం వేరు చేసి... రేవులో పడేసి..! - భార్యను హత్య చేసిన భర్త వార్తలు

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో దారుణం జరిగింది. తన భార్యను కిరాతకంగా నరికి రేవులో పడేశాడు కసాయి భర్త. చేపల వేటకు వెళ్లిన వారిద్దరిలో... భర్త ఒక్కడే తిరిగి ఇంటికి రావటంతో అనుమానం వచ్చిన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చేపల వేటకు వెళ్లిన ప్రదేశాన్ని పరిశీలించగా... తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

a women was brutally killed in nizampatnam at guntur district
తల,మొండెం వేరు చేసి... రేవులో పడేసి

By

Published : Nov 21, 2020, 6:35 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు, మరియమ్మ దంపతులు చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇద్దరూ కలిసి గొంది సముద్రం సమీపంలోని ఓ రేవులో చేపల వేటకు బోటులో వెళ్లారు. మడ అటవీ ప్రాంతంలో భర్త భార్యను కిరాతకంగా తల మొండెం వేరు చేసి రేవులో పడేశాడు.

తండ్రి ఒక్కడే తిరిగి ఇంటికి రావటంతో అనుమానం వచ్చిన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు చేపల వేటకు వెళ్లిన ప్రదేశానికి వెళ్లి చూడగా మృతదేహం లభ్యమైంది. తల, మొండేన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details