ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. భర్త, మృతురాలి తల్లిదండ్రుల పరస్పర ఫిర్యాదులు - గుంటూరు నేర వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్​ ఒత్తిడి కారణంగానే తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తమ అల్లుడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తమ కుమార్తెను వేధించాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య.. భర్త, మృతురాలి తల్లిదండ్రుల పరస్పర ఫిర్యాదులు
వివాహిత ఆత్మహత్య.. భర్త, మృతురాలి తల్లిదండ్రుల పరస్పర ఫిర్యాదులు

By

Published : Jul 30, 2020, 5:44 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల సాయిబాబా గుడి ఎదురు వీధిలో షేక్​ జానీ బేగం అనే వివాహిత ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రెండో పట్టణ పోలీస్​ కానిస్టేబుల్​ ఒత్తిళ్ల మేరకు తన భార్య ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ అల్లుడు షేక్​ ఖాజా వలి అనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమ కుమార్తెను వేధింపులకు గురి చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.కృష్ణయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details