Women Questioned Mla kilari rosaiah: వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుంటూరు జిల్లా పొన్నూరులో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ఓ మహిళ నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు వివరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న షేక్ నాజిని అనే మహిళ జోక్యం చేసుకుంది. మా పిల్లలపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా ఎందుకు వేధిస్తున్నారని గట్టిగా నిలదీసింది. ఎమ్మెల్యే ఎవరికి ఏం జరిగిందని అడగ్గా తమ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పింది. అయితే ఆ విషయం ఇప్పుడు మాట్లాడేది కాదన్నారు. మరి ఎన్నికల సమయంలో మా పిల్లల్ని ఎందుకు వాడుకున్నారని నాజిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పట్టించుకోకుండా ముందుకు వెళ్లటంతో.. తన బాధని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి మొరపెట్టుకుంది. ఎమ్మెల్యే పీఎ ని కొట్టారని తన కుమారుడితో పాటు 16మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వివరించింది.
మా పిల్లలను ఎందుకు వేధిస్తున్నారంటు ఎమ్మేల్యేను నిలదీసిన మహిళ - Ap latest News
Women Questioned Mla గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో నాజిని అనే మహిళ, ఎన్నికల వేళ తమ పిల్లలను వాడుకున్న వారే ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేయిస్తున్నారని ప్రశ్నించింది.
Etv Bharat