ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మలేసియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురి చేశారు' - fraud in malasia latest news

ముగ్గురు వ్యక్తులు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మలేసియా తీసుకెళ్లి అక్కడ ఓ వైద్యుడికి తనను విక్రయించారని ఓ మహిళ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. రెండున్నర లక్షలు తన దగ్గర వసూలు చేశారని... ఐదు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని వాపోయింది.

a-woman-who-cheated
'మలేషియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురిచేశారు'

By

Published : Feb 24, 2020, 11:51 PM IST

Updated : Feb 25, 2020, 12:01 AM IST

వివరాలు వెల్లడిస్తోన్న బాధిత మహిళ

విదేశాల్లో ఉద్యోగమంటూ అమాయక మహిళలను మోసగిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన బాధితురాలు వెంకాయమ్మకు మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు... నాలుగు నెలల క్రితం పరిచయమయ్యారు. మలేసియాలో ఉద్యోగం పొందేందుకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు. డిసెంబర్​లో డబ్బులు తీసుకొని విజిటింగ్ వీసాపై వెంకాయమ్మను మలేషియా పంపించారు. మలేషియాలో మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో అక్కడ ఒక డాక్టర్ వద్ద ఇంటి పనులు చేసేందుకు కుదిర్చారు. అయితే నెల రోజుల గడిచిన తర్వాత జీతం అడగటంతో అసలు విషయం బయటపడిందని... తనను కొనుగోలు చేసినట్లు వైద్యుడు చెప్పినట్లు బాధిత మహిళ తెలిపింది. వారి చెర నుంచి బయట పడే ప్రయత్నంలో... ఐదు రోజుల పాటు తనను బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు వాపోయింది. ఎట్టకేలకు వారికి డబ్బులు చెల్లించి స్వదేశానికి వచ్చినట్లు పోలీసుల ఎదుట చెప్పింది.

ఇవీ చూడండి:

ఎస్సై వక్రబుద్ధి... భార్యను హింసిస్తూ వేరే మహిళతో రాసలీలలు

Last Updated : Feb 25, 2020, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details