ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలగపూడిలో రణరంగం... ఇరు వర్గాల ఘర్షణలో మహిళ మృతి - velagapudi village news

గుంటూరు జిల్లా వెలగపూడిలో చిన్న విషయంలో నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకున్నారు.

fight in velagapudi
fight in velagapudi

By

Published : Dec 28, 2020, 8:28 AM IST

వెలగపూడిలో రణరంగం... ఇరు వర్గాల ఘర్షణలో మహిళ మృతి

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎస్సీ కాలనీలో రెండు వర్గాల చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కాలనీలో ప్రభుత్వం సిమెంట్ రోడ్లు నిర్మిస్తోంది. రెండు వర్గాల మధ్యలో ఉన్న రోడ్డుపై ఆర్చ్ నిర్మించి దానికి ఓ జాతీయ నేత పేరు పెట్టాలని ఓ వర్గం ప్రతిపాదించింది. దీనికి మరో వర్గం వ్యతిరేకించటంతో వివాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మళ్లీ వేడెక్కింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ మహిళ పరిస్థితి విషమంగా మారటంతో గుంటూరుకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని వెలగపూడికి తరలించారు. గ్రామంలో మరోసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details