గుంటూరు చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన తాడికొండ నాగమణి పోతవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. విధులకు హాజరయ్యేందుకు తన సోదరుడు రామారావు ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చోని వెళ్తుండగా పోతవరం సమీపంలో ఆమె చీర ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో చుట్టుకుపోయింది. ఆమె కిందకు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలికి ప్రాధమిక చికిత్స అందించి చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ద్విచక్రవాహనంపై నుంచి పడిన మహిళ.. ఆస్పత్రికి తరలింపు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరంలో ప్రమాదవశాత్తు మహిళ ద్విచక్రవాహనంపై నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 సిబ్బంది చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
![ద్విచక్రవాహనంపై నుంచి పడిన మహిళ.. ఆస్పత్రికి తరలింపు ద్విచక్రవాహనం నుంచి కిందపడ్డ మహిళ...ఆస్పత్రికి తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12171646-174-12171646-1623947804327.jpg)
ద్విచక్రవాహనం నుంచి కిందపడ్డ మహిళ...ఆస్పత్రికి తరలింపు