Wife Killed Her Husband: కలకాలం.. కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గోడ్డె బసవయ్య, సుజాత దంపతులు. సుజాతకు అదే ఊరికి చెందిన దర్షన్ బాబుతో వివాహేతర సంబంధం ఉంది. వీరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. ప్రియుడు బాబుతో కలిసి భర్త గొంతు నులిమి చంపింది.
భర్త అడ్డు తొలగించాలనుకుంది.. ఆ భార్య ఏం చేసిందంటే... - Crime News
Wife Killed Her Husband: ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఈ సంబంధం వలన ఒక్కోసారి అన్యాయంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇలానే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహేతర సంబంధం నిండు ప్రాణం తీసింది. ఆమెకు అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన మృతుని బామ్మర్ధి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
హత్య
మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసవయ్య బావమరిది లాలయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వివాహేతర సంబంధం విషయంలో పంచాయితీ జరిగినట్టు లాలయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : Jan 10, 2023, 9:04 PM IST