విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం మండల పరిషత్ పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీస్తే... అలాంటిది ఏమీ లేదని బుకాయించాడు. విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి...ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని.. జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు.
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన - ఆకుల గణపవరంలో విద్యార్థునులపై ఉపాధ్యాయుడి వేధింపులు
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకులగణపవరం మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన తల్లితండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు..అతడిని సస్పెండ్ చేశారు.
![విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన a teacher harresements on students at akula ganapavaram in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6192250-797-6192250-1582578346977.jpg)
ఉపాధ్యాయుడిని కొడుతున్న ఓ విద్యార్థిని తల్లి
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేస్తున్న విద్యార్థినుల తల్లులు
Last Updated : Feb 25, 2020, 8:50 AM IST