ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేను కాదు.... ఆ మంత్రులే పెయిడ్‌ ఆర్టిస్టులు' - రాజధాని మార్పు

వెలగపూడిలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ విద్యార్థి తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వర్తమాన అంశాలపై ఆ బుడతడు మాట్లాడిన తీరు... అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

A student in Velagapudi caught everyone's attention with his speech
A student in Velagapudi caught everyone's attention with his speech

By

Published : Jan 5, 2020, 9:55 PM IST

అమరావతిలోనే ఏపీ రాష్ట్ర రాజధానిని కొనసాగించాలంటూ వెలగపూడిలో రైతులు చేస్తున్న ఆందోళనకు విద్యార్థులు, మహిళలు మద్దతు తెలుపుతున్నారు. కేవలం కక్షతోనే రాజధాని రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని విద్యార్థులు ఆక్షేపిస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ విద్యార్థి రాజధాని అంశంపై మాట్లాడిన తీరు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమరావతిలో ప్రజలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయమని ఆ బుడతడు ప్రసంగించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది.

బుడతడి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details