ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 24, 2020, 8:23 AM IST

ETV Bharat / state

'రూ.5 వేల కోసం తీవ్రంగా వేధిస్తున్నారు'

ఆన్​లైన్ రుణ యాప్‌ల వేధింపులు ఆగడం లేదు. తీసుకున్న రుణం చెల్లించడానికి ఒక్కరోజు ఆలస్యమైనందుకు తనను యాప్​ నిర్వాహకులు వేధిస్తున్నారంటూ ఓ విద్యార్థి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశాడు. తన కాంటాక్ట్స్​లో ఉన్న వారికి తాను 420 అని, స్నేహితులు, బంధువుల పేర్లు చెప్పి రుణం తీసుకున్నాడంటూ సందేశాలు పెట్టి పరువు తీస్తున్నారని వాపోయాడు.

online loan apps
online loan apps

ఆన్​లైన్ రుణ యాప్​ల వేధింపుల నుంచి కాపాడాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఓ విద్యార్థి బుధవారం ఫిర్యాదు చేశాడు. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గుంటూరులోని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరాడు. వైద్య ఖర్చుల కోసం ఆన్​లైన్ యాప్ ద్వారా మొదట 5 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. వాటిని సకాలంలో చెల్లించడానికి మరొక యాప్​లో 10 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఇలా మరో 10 యాప్​లలో సుమారు 60 వేల రూపాయలకు పైగా రుణం తీసుకున్నాడు. అప్పునకు వడ్డీలతో కలిపి రూ.లక్ష వరకు చెల్లించాడు.

మరో 5 వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా... ఒకరోజు ఆలస్యమైందంటూ ఆయా యాప్‌ల నిర్వాహకులు అధిక వడ్డీలు వేసి వెంటనే చెల్లించాలని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు. తన కాంటాక్ట్స్​లో ఉన్న వారికి తాను 420 అని, స్నేహితులు, బంధువుల పేర్లు చెప్పి రుణం తీసుకున్నాడంటూ సందేశాలు పెట్టి పరువు తీస్తున్నారని వాపోయాడు. రోజుకు 50 సార్లు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details