ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ.. అందరి ఆదరాభిమానాలను పొందుతున్న నటుడు సోనుసూద్. ఆయన సేవలకు ముగ్ధుడైన ఓ విద్యార్థి భారీ చిత్రాన్ని అతితక్కువ సమయంలో గీశాడు. గుంటూరు జిల్లా.. తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ ఇటీవల చిత్రించిన 273 చదరపు మీటర్ల భారీ చిత్రం 12 ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో నమోదయింది. ఈ వివరాలతో హైదరాబాదుకు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ సత్కరించటానికి ఆహ్వానం పలికాయి. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అతి తక్కువ సమయంలో సోనుసూద్ భారీ చిత్రం.. 12 ప్రపంచ రికార్డుల్లో నమోదు - latest news in guntur district
సోనుసూద్ సమాజ సేవకు అభిమానిగా మారిన ఓ విద్యార్థి ఆయన భారీ చిత్రాన్ని అతితక్కువ సమయంలో చిత్రీకరించాడు. ఈ కారణంగా 12 ప్రపంచ రికార్డుల పుస్తకాలలో అతని పేరు నమోదు అయింది.
సోనుసూద్ చిత్రం