ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి ! - a student died after felt from building at ravipadu

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులోని ఓ హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.

a student died after felt from building at ravipadu
రావిపాడులో విద్యార్థి మృతి

By

Published : Apr 16, 2021, 12:07 AM IST

హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో జరిగింది. నకరికల్లు మండలం రుపెనగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి మేడా కిరణ్... రావిపాడు రోడ్డులోని ఆక్స్ ఫర్డ్ విట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలకు చెందిన హాస్టల్​లో ఉంటున్న కిరణ్​.. ఈ ఉదయం హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని నరసరావుపేట గ్రామీణ ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి అన్నారు. మృతుని తండ్రి శ్రీనివాసరావు పిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ABOUT THE AUTHOR

...view details