ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినూత్న ప్రచారం.. గుంటూరు వాసి సేవాపథం - guntur dst corona virus awareness news

కరోనా వైరస్​పై అధికారులతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మల్లికార్జున అనే వ్యక్తి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తన ద్విచక్రవాహనంపై మైకు అమర్చుకుని 2 నెలలుగా ఈ మహమ్మారిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

a socialistic person gave awareness on corona virus in guntur dst
a socialistic person gave awareness on corona virus in guntur dst

By

Published : Jun 6, 2020, 2:47 PM IST

కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఇలా ఎవరి పరిధిలో వారు పని చేస్తున్నారు. వారికి తోడు తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు గుంటూరుకు చెందిన మల్లికార్జున రావు. సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే మల్లిఖార్జున ప్రస్తుతం కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ.. వైరస్ తీరును వివరించారు. కరోనా బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలన్నది ప్రజలకు వివరించారు. అలాగే.. నిరాశ్రయిలకు దాతలు భోజనం అందజేసే ప్రాంతాలకు వెళ్లి వారికి జాగ్రత్తలు చెబుతూ.. భౌతిక దూరం ఎంతముఖ్యమన్నది వివరిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లకు ప్రత్యామ్నాయం గురించి అవగాహన కల్పించారు.

కరోనా గురించి ప్రచారం చేసే క్రమంలో తన వాహనాన్ని కూడా విభిన్నంగా డిజైన్ చేసుకున్నారు మల్లికార్జున రావు. కరోనా వైరస్ రూపంతో వాహనం ముందు భాగంగా ఓ మోడల్ ను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనానికి మైక్ అమర్చుకుని ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

"లాక్​డౌన్ పూర్తవగానే తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి"

ABOUT THE AUTHOR

...view details