గుంటూరు జిల్లా నందివెలుగులోని ఓ సిమెంటు రాళ్ల పరిశ్రమలో వీరాంజనేయులు అనే వ్యక్తి ట్రాక్టరు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాళ్లను లోడ్చేసే క్రమంలో ఆయన చేతిపై తాచుపాము కాటేసింది.
వెంటనే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఒక డబ్బాలో వేసి మూత బిగించారు. డబ్బాతో సహా తెనాలి ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది వీరాంజనేయులు చికిత్స చేసి ప్రాణహాని లేదని భరోసా ఇచ్చారు. పామును జనసంచారం లేని ప్రదేశంలో వదిలిపెడతానని ఆయన తెలిపారు.