ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పిపోయిన బాలుడు.. 6 గంటల్లోనే కుటుంబీకులకు అప్పగింత - గుంటూరు జిల్లా వార్తలు

ఇంటి నుంచి తప్పిపోయి వీధుల్లో తిరుగుతున్న ఏడేళ్ల బాలుడిని గుంటూరు కొత్తపేట పోలీసులు 6 గంటల్లోనే చిన్నారి తాతయ్య వద్దకు చేర్చారు. బాలుడు తప్పిపోయి కంగారుగా వెతుకుతున్న ఆ తాతకు.. గంటల వ్యవధిలోనే పోలీసులు ఉపశమనం కలిగించారు.

A seven-year-old boy who went missing from home and wandered the streets was taken by the Guntur Kottapet police to the child's grandfather within 6 hours.
ఆరు గంటల్లోనే బాలుడి అప్పగింత

By

Published : Sep 16, 2020, 11:22 AM IST

గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా... ఓల్డ్ క్లబ్ రోడ్డు వద్ద ఓ బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. గమనించిన ఎస్సై హరిచందన, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏఎస్సై బేబీ రాణి.. ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని వివరాలు రాబట్టారు. తన పేరు సంతోశ్​గా.. బుడంపాడు పాఠశాలలో ఎల్ కేజీ చదువుతున్నట్లు చెప్పాడు.

చిరునామా వాకబు చేయగా.. ఇన్నయ్యనగర్​కు చెందిన నాగయ్య మనవడిగా బాలుడిని గుర్తించారు. నాగయ్య ఇంటికి వెళ్లి విచారించగా.. కుమారుడు, కోడలి మధ్య మనస్పర్థల కారణంగా.. మనవడిని తన వద్దే ఉంచుతున్నట్లు చెప్పారు. తన మనవడు తప్పిపోయిన 6 గంటల్లోనే అప్పగించిన పోలీసులకు నాగయ్య కృతజ్ఞతలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details