ద్విచక్రవాహనాన్ని నిలిపి ఉంచి.. రోడ్డు పక్కనే నిలబడిన వ్యక్తులను వేగంగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణ పల్లి గ్రామం వద్ద గల హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు దుర్గి గ్రామానికి చెందిన నరసింహారావుగా గుర్తించారు. మరోకరి వివరాలు తెలియాల్సి ఉంది.