గుంటూరు జిల్లాలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పిరంగీపురం మండలంలోని కండ్రిక గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసరి గోవిందరాజు గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గోవిందరాజుకు 3 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా… కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
పుట్టింటికి వెళ్లిన కారణంగా..
ఈ క్రమంలో బాధితుడి భార్య అలిగి.. పుట్టింటికి వెళ్లగా.. మనస్తాపానికి గురైన గోవిందరాజు ఉదయం నుదురుపాడు రైల్ గేట్ వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గోవిందరాజులు ఆత్మహత్య గ్రామంలో పెను విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న నరసరావుపేట రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి :కుటుంబాల్లో కరోనా కల్లోలం.. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురేసి మృత్యువాత