గుంటూరు జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తెనాలి మండలం బుర్రిపాలెంలోని ఓ దుకాణంలో యజమానిని మాటల్లో పెట్టిన యువకుడు.. మరో వ్యక్తి సహాయంతో గల్లాపెట్టె తీసుకుని బైక్పై పరారయ్యాడు. యువకుడు గల్లాపెట్టె దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారిద్దరూ కలిసి మరో ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాటల్లో పెట్టి... గల్లా పెట్టెనే దోచుకెళ్లాడు..! - a person theft money box in a shop at gutur dst
కిరాణా షాపు యజమానిని మాటల్లో పెట్టి ఓ యువకుడు మరొకరి సహాయంతో ఏకంగా గల్లాపెట్టెనే ఎత్తుకెళ్లాడు. అయితే మరో ఇంట్లో వీరు దొంగతనం చేస్తుండగా పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జరిగిన ఘటన వివరాలివి..!
సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగతనం దృశ్యాలు