గుంటూరు జిల్లాకు చెందిన చందర్ రావు అనే వ్యక్తి... లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు పయనమైన వారి దాహం తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. కోళ్లఫారంలో పనిచేసే ఆయన... జాతీయ రహదారి వెంట రోజూ కూలీలకు మంచి నీళ్లు అందిస్తున్నారు.
మట్టి కుండలో రోజూ 10 క్యాన్ల మంచినీరు పోస్తున్నారు. వారం రోజులుగా ఈ సాయం చేస్తున్నారు. జాతీయ రహదారిపై కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్న వలస కూలీలు దప్పిక తీర్చుకుంటున్నారు.