ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హుడిగా తొలి పేరు అయినా దక్కని ఉద్యోగం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

కష్టపడి చదువుకున్న చదువుతో ఉద్యోగం వస్తుందని ఏళ్లతరబడి ఎంప్లాయ్​మెంట్​ ఆఫీస్​లో తన వివరాలను నమోదు చేసుకుంటూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఓ అవకాశం.. ఆఫీస్ సబార్డినేట్ రూపంలో తలుపు తట్టింది. అనుకున్నదే తడవుగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడి అధికారులు కూడా ఎంప్లాయ్​మెంట్ ఆఫీస్ లిస్టులో నీ పేరే తొలిగా ఉందని.. నీకే ఈ ఉద్యోగం వస్తుందని చెప్పారు. దీంతో కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవచ్చు అనుకున్నాడు. అయితే చివరికి ఉద్యోగం కాస్త వేరొకరికి వరమైంది.

fight for job
ఉద్యోగం కోసం పోరాడుతున్న రాజు

By

Published : Apr 7, 2021, 2:08 PM IST

ఉద్యోగం కోసం పోరాడుతున్న రాజు

గుంటూరు జిల్లా స్టువర్టుపురం గ్రామానికి చెందిన రాజు 1990లో చదువు ముగించుకుని ఎంప్లాయ్​మెంట్​ ఆఫీస్​లో పేరు నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి తరచూ ఉద్యోగం కోసం ఎంప్లాయ్​మెంట్ రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్​లో జలవనరుల శాఖ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి పిలుపు వచ్చింది. ఎంతో సంతోషంతో మౌఖిక పరీక్ష పూర్తి చేసి.. కచ్చితంగా ఉద్యోగం వస్తుందని భావించారు. అధికారులు కూడా నీకే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పటంతో.. అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకున్నారు.

చివరికి ఎంప్లాయ్​మెంట్ జాబితాలో లేని వేరే వ్యక్తికి ఆ ఉద్యోగం కట్టబెట్టారని రాజు ఆరోపించారు. అర్హతలు ఉన్న తనకు కాకుండా.. వేరొకరికి ఉద్యోగం ఇవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులను విన్నవించుకున్నా.. వారు మాట దాట వేయడంతో బాధపడ్డారు. అధికారులు కావాలనే ఈ ఉద్యోగం తనకు రాకుండా చేశారని రాజు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ...నందిగామలో కొనసాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు..

ABOUT THE AUTHOR

...view details