గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం రేపూడి గ్రామానికి చెందిన మారేళ్ల రమణారెడ్డి ఇంట్లో శుభకార్యం ఉన్నందున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు అడ్డురావడంతో వాటిని కొట్టించాడు. దీంతో పక్కింటి అరె పున్నారెడ్డి, కోటిరెడ్డి.. మా చెట్టును ఎలా కొడతారని రమణారెడ్డిపై గొడవకు వచ్చారని అతని బంధువులు తెలిపారు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో ఒక్కసారి నెట్టడంతో రమణారెడ్డి కింద పడిపోవడంతో చనిపోయినట్లు పేర్కొన్నారు.
మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పిరంగిపురం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.