గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరోజు వయసు గల పసికందును తల్లి ఆసుపత్రిలోనే వదిలి వెళ్ళింది.గత నెల17తేదీన ఆసుపత్రిలో చేరిన పావని అనే గర్భిణీ,28వ తేదీనఆడపిల్లకి జన్మనిచ్చింది.పుట్టిన పాపకు అరోగ్యం బాగా లేకపోవడంతో29న పాపను వదిలేసి తల్లిదండ్రులు,బంధువులు వెళ్లిపోయారు.తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా చిన్నగంజాం గ్రామానికి చెందిన వారిగా పేర్లు నమోదు అయ్యినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.దీనిపై ఆసుపత్రి వైద్యులు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పసికందును ఆసుపత్రిలోని వదిలేసిన ఓ తల్లి - A mother leaving a babe in a hospital in Guntur.
అమ్మతనం కోసం వయసుకు మించిన పరీక్షలు ఎదుర్కొన్నవారెందరో ఉన్నారు. కాని ఓ తల్లి మాత్రం అనారోగ్యంతో పుట్టిందని, ఒక రోజు వయస్సున్న ఆడపిల్లని..ఆసుపత్రిలోనే వదిలేసింది.ఈ ఘటనపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
![పసికందును ఆసుపత్రిలోని వదిలేసిన ఓ తల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4506641-938-4506641-1569043101309.jpg)
baby is unhealthy