గత రెండేళ్లుగా ఓ యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని గుంటూరుకి చెందిన ఓ వివాహిత వాపోయింది. 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసి..కేసు పెట్టిన యువకుడు ఇంకా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే వివాహిత తన భర్తతో విడాకులు తీసుకుని కొన్నేళ్లుగా విడిగా ఉంటుంది. శుభకార్యాలలో వంటకాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ.. తన ఇద్దరి ఆడపిల్లలను పోషిస్తుంది. ఒంటరిగా ఉంటున్న ఆమె పై గుంటుపల్లి రమేశ్ అనే యువకుడు కన్నుపడింది. గత కొన్నేళ్లుగా రామకృష్ణ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వివరించింది.