నకిలీ పత్రాలు చూపించి ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. ప్రభుత్వ పనులు కాంట్రాక్టు పద్ధతిలో తమ కంపెనీలు నిర్వహిస్తున్నాయన్న... ఓ మోసగాడి మాటలు నమ్మి రూ. రెండు కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుడు.. జిల్లా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగదును తిరిగి ఇవ్వాలని అడిగితే... తనను బెదిరిస్తున్నాడని బాధితుడు తెలిపాడు.
హైదరాబాద్ లోని అమీర్ పేటకు చెందిన తోట లక్ష్మీ శ్రీనివాస్ ఆర్కిటెక్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరులోని కన్నవారితోటకు చెందిన తిరుమలశెట్టి రాఘవ, చార్టెడ్ అకౌంటెంట్ గా... శ్రీనివాస్‌కు రెండు ఏళ్ల క్రితం పరిచయం అయ్యాడు. తాను నాలుగు కంపెనీలు నడుపుతున్నాని... వాటికి ప్రభుత్వ గుర్తింపు ఉందని నమ్మించాడు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టు పనులు తమకే వస్తాయని ఫోర్జరీ పత్రాలూ చూపించాడు. ఆ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు... విడతల వారిగా కంపెనీల్లో రూ.రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు.