ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దె కోసం యజమాని వేధింపులు.. భరించలేక వ్యక్తి ఆత్మహత్య - గుంటూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య వార్తలు

అద్దె ఇవ్వమని ఇంటి యజమాని వేధింపులకు గురి చేస్తుండటంతో... మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా బొంగరలాబీడు వెంగయ్యనగర్​లో జరిగింది. సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొని... కేసు దర్యాప్తు చేస్తున్నారు.

a man suicide with the cause of housewoner Harassment in Bongaralabidu Vengayanagar, Guntur District
a man suicide with the cause of housewoner Harassment in Bongaralabidu Vengayanagar, Guntur District

By

Published : Jun 2, 2020, 9:54 AM IST

గుంటూరు జిల్లా బొంగరలాబీడు వెంగయ్యనగర్​లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షేక్ జానాబు నూడిల్స్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్​డౌన్ కారణంగా ఆదాయం లేక మూడు నెలలుగా ఇంటి యజమానికి అద్దె చెల్లించలేకపోయాడు.

యజమాని అద్దె ఇవ్వమని నిత్యం వేధించి... ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నానని తెలిపాడు. తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి... ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్​కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జానాబు భార్య అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానాబు రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదంవడి:వివాహేతర సంబంధం: రెండు హత్యలూ.. ఒక ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details